నాకేం కాలేదు నేను బానే ఉన్నా
ఎప్పటి లాగే అన్నీ అమర్చబడే ఉన్నై
ఐతే , అప్పుడప్పుడూ
అదీ ఈ మధ్యనే
కనురెప్పలు విడివడడానికి సంకోచిస్తున్నప్పుడు
ఇంచు ఇంచుకూ స్పర్శ ను తెలియజేస్తూ
శ్వాసకు స్పందననిస్తూ
నీరెండకు గొడుగు పడుతూ
అశ్రద్ధ గా పేర్చినట్టూ
బద్ధకం గా విసరినట్టూ ఉన్న
కురుల అలల్లో ముఖం మునిగి తేలుతున్నప్పుడొకసారి
నీ స్వేదపు సుగంధాలు
నయనాలను తడిపినపుడు ఇంకోసారి
పలుకులు వీనుల నిండగా
వీణలా స్వర పేటిక resonate అయి
వణుకుతూ వంత పాడినపుడు మరోసారీ ..... మాత్రం
తనకు చోటు సరిపోవట్లేదని
ద్రవించి పెల్లుబికి
అలలై ఎగిసి
ఇంకా ఇరుకేనని
ఆవిరై గాల్లో ఎగిరింది .... నా హృదయం ఆ క్షణంలో
-- -- -- -- -- --
ఆ క్షణంలోనే వెనువెంటనే
తెరిస్తే కల కాకుండా పోతుందని
రెప్పలు సతమతమవుతుంటే
reverse sublimation జరిగి
ఇనుప ముద్ద ఐ
ఆపాదమస్తకం అన్ని కణాలకీ ఊపిరి ఆపింది
రాయిలా రాలి నేలకొరిగింది
No comments:
Post a Comment