చేతిలోని రేఖలా ?
నుదుటి మీది రాతలా ?
కంటి కింది చారలా ?
ఏమిటివి ?
తెగిన గాలిపటమూ
రైలు బండి దారీ
భూ మధ్య రేఖా
ఓల్డ్ సిటీ లో నాళా
ఎక్కడ మొదలయ్యాయి ?
ఎక్కడికెలుతున్నాయి ?
అమ్మాయి కి వేసే లైనేమో
పట్టు దారమో పసుపు తాడేమూ
LOC సరిహద్దేమో
తెల్లబోయి ఎండిపోయి చిక్కు పడ్డ ముసలి అవ్వ జుట్టేమో
జగమంతా నిండినవీ
అయినా
ఏ కంటికి అందనివీ
నన్నూ నిన్నూ
ఎవరెవ్వరినో ఇంకెవ్వరినో
అందరినీ కలిపి కట్టిన దండలోని
అదృశ్య దారాలు
ఎప్పటివీ ఎక్కడివీ ఏమిటివీ ??????