Physical Dream



నాకేం కాలేదు   నేను బానే ఉన్నా
ఎప్పటి లాగే అన్నీ అమర్చబడే ఉన్నై 

ఐతే , అప్పుడప్పుడూ  
అదీ ఈ మధ్యనే 

కనురెప్పలు విడివడడానికి సంకోచిస్తున్నప్పుడు 
ఇంచు ఇంచుకూ స్పర్శ ను తెలియజేస్తూ 
శ్వాసకు స్పందననిస్తూ 
నీరెండకు గొడుగు పడుతూ 
అశ్రద్ధ గా పేర్చినట్టూ
బద్ధకం గా విసరినట్టూ   ఉన్న 
కురుల అలల్లో ముఖం మునిగి తేలుతున్నప్పుడొకసారి 

నీ స్వేదపు సుగంధాలు 
నయనాలను తడిపినపుడు ఇంకోసారి 

పలుకులు వీనుల నిండగా 
వీణలా స్వర పేటిక  resonate అయి 
వణుకుతూ వంత పాడినపుడు మరోసారీ     ..... మాత్రం  


తనకు చోటు సరిపోవట్లేదని 
ద్రవించి పెల్లుబికి 
అలలై ఎగిసి 
ఇంకా ఇరుకేనని 
ఆవిరై గాల్లో ఎగిరింది   .... నా హృదయం   ఆ క్షణంలో 

-- -- -- -- -- --

ఆ క్షణంలోనే వెనువెంటనే 

తెరిస్తే కల కాకుండా పోతుందని 
రెప్పలు సతమతమవుతుంటే 

reverse sublimation జరిగి 
ఇనుప ముద్ద  ఐ
ఆపాదమస్తకం అన్ని కణాలకీ ఊపిరి ఆపింది 
రాయిలా రాలి నేలకొరిగింది

సమీకరణం

This is supposed to be a song of a person who is toying with the idea of suicide.  

నా ప్రశ్నకి బదులు లేదు   
ఈ రేయికి పగలు లేదు 

తూట్లు పడ్డ హృదయంతో 
మసక బడ్డ చూపులతో 
దరిని లేని నీ కొరకై 
ఏ వైపుకని..., ఎదురీదను.... 
ఈ నడిసంద్రంలో ఓ
(ఈ రేయికి పగలుందా ?  ఈ రేయికి పగలుందా ? నా ప్రశ్నకి బడులుందా?) -- chorus

కనులు తడవని , వంచన తుంచని 
మనిషంటూ ఉండడే
వికట ఆటవిక ఈ లోకంలో 
ఆందోళన పరిచయమే  ... అందరికీ ఈ 

సంతాపాల సంతసాల 
బ్రతుకు సమీకరణంలొ
చావు ప్రతిక్షేపం 
అహేతుకం అహేతుకం 
అహేతుకం  కాదా?  అని... నా ప్రశ్న నన్ను అడిగింది

కాల గతిన గత స్మృతులు కాలం చేస్తాయని 
మరుపు సంధ్య తో చల్లని వెన్నెల తోడొస్తుందని
ప్రతి నేటికి రేపుంటుందని  ప్రతి నేటికి రేపుంటుందని .......
రేపుంటుందనీ  ఈ ఈ 
( చావు ప్రతిక్షేపం  అహేతుకం అహేతుకం) chorus
ప్రతి నేటికి రేపుంటుందనీ  ....

గీతలు

చేతిలోని రేఖలా ?
నుదుటి మీది రాతలా ?
కంటి కింది చారలా ?
ఏమిటివి ?

తెగిన గాలిపటమూ 
రైలు బండి దారీ 
భూ మధ్య రేఖా 
ఓల్డ్ సిటీ లో నాళా
ఎక్కడ మొదలయ్యాయి ?
ఎక్కడికెలుతున్నాయి ?

అమ్మాయి కి వేసే లైనేమో
పట్టు దారమో పసుపు తాడేమూ
LOC సరిహద్దేమో 
తెల్లబోయి ఎండిపోయి  చిక్కు పడ్డ ముసలి అవ్వ జుట్టేమో

జగమంతా నిండినవీ
అయినా 
ఏ కంటికి అందనివీ 

నన్నూ నిన్నూ 
ఎవరెవ్వరినో ఇంకెవ్వరినో
అందరినీ కలిపి కట్టిన దండలోని 
అదృశ్య దారాలు 

ఎప్పటివీ ఎక్కడివీ ఏమిటివీ ??????