నా బతుకు నేను బతుకుతా, నా చావు నేనే చస్తా





నా బతుకు నేను బతుకుతా
నా చావు నేనే చస్తా


కొలతలూ కొలమనాలూ 


పరుగు పోటీ
పచ్చనోటూ పేరూ 
సున్నా ఒకట్ల binary మనస్తత్వపు పునాదులపై 
కట్టిన గాడాంధకార కారాగారపు బంగారు ఇటుకలు 

ఇక చెల్లదు అజమాయిషీ
ఇవ్వను నే సంజాయిషీ

ఊరందరితో ఉరుకులు ఆపి  
నాతో నే మాట కలుపుతా

శ్రద్ధ లేని శ్రోతకు నా గొంతు పలకదు
మేధ లేని మాట నా చెవికెక్కదు 

నాకుండదు సుఖం దుఃఖం
జయాపజయాల లెక్కలు వ్యర్థం

నా బతుక్కి అర్థం కోసం
ఈ విశ్వపు హద్దులకెళతా

గిరిగీసే గీతలన్నీ
రాతలతో చేరిపేస్తా

నా బతుకు నేను బతుకుతా
నా చావు నేనే చస్తా